వర్షాకాలంలో  దుస్తులు త్వరగా ఆరాలంటే..

వర్షంలో తడి దుస్తులు ఆరబెట్టడానికి 2 టవల్స్ ఉపయోగించాలి, ఉతికిన తర్వాత దుస్తుల్ని ఈ 2 టవల్స్ మధ్య ఉంచి గట్టిగా పిండాలి.

నీరు బయటకు వస్తుంది.  ఇది ఒక టెక్నిక్. చిన్న పిల్లల దుస్తులు త్వరగా ఆరేందుకు ఇది సరిపోతుంది.

తడి దుస్తులను ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ ఉపయోగించవచ్చు.

హెయిర్ డ్రైయర్ నుండి వేడి గాలి తగిలి, దుస్తులు త్వరాగా ఆరేందుకు అవకాశం ఉంటుంది.

దుస్తులు వేయడానికి, అల్మారాలో దుస్తులు వేలాడదీయడానికి వాడే హ్యాంగర్లను ఉపయోగించండి.

ఈ హ్యాంగర్‌ని కిటికీ పైపుపై వేలాడదీయండి, అన్ని వైపుల నుండి గాలి తగిలి, త్వరగా ఆరిపోతాయి.