పెరుగులో ఇది కలిపి జుట్టుకు రాస్తే..
ప్రస్తుత జీవన శైలి కారణంగా చాలా మంది తెల్ల జుట్టు సమస్య ఎదుర్కొంటున్నారు
నిండా ముప్పై ఏళ్లు నిండక ముందే చాలా మంది యువత తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు.
మన వంటగదిలో దొరికే పెరుగు, కరివేపాకులతో జుట్టు తెల్లబడటాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.
ఇందులో ఉండే కొన్ని ఆయుర్వేద గుణాలు జుట్టును నల్లగా చేసేందుకు సహాయపడతాయి.
కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ప్రోటీన్లు, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
ఇక, పెరుగులో లాక్టిక్ యాసిడ్, ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టుకు కండీషనర్‌గా పనిచేసి, చుండ్రును తగ్గించడంలో సాయపడతాయి.
అంతేకాకుండా పెరుగు జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. జుట్టు పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది.
వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
Related Web Stories
ఉదయాన్నే కాఫీకి బదులుగా వీటిని తీసుకోండి..
ఉల్లిపాయల్ని కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..
సిగరేట్ తాగిన తర్వాత శరీరంలో జరిగేది ఇదే..
రోజుకు ఆరు వేల అడుగులు.. ఈ సూపర్ పవర్స్ మీ సొంతం..