ఇంట్లో బొద్దింకలన్నింటిని శాశ్వతంగా తరిమికొట్టే సింపుల్ చిట్కాలు..!

సాధారణంగా ప్రతి ఒక్కరి వంటింట్లో తిరుగుతూ విసిగించే బొద్దింకలు అందరికీ పెద్ద తలనొప్పిగా ఉంటాయి.

ఎంత తరిమి కొట్టినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అయితే, బొద్దింకలే కదా అని ఊరుకుంటే ఇంట్లో వ్యాధులు తిష్టవేసినట్లే. కాబట్టి ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వెంటనే వాటిని వదిలించుకోవడం చాలా మంచిది.

కొన్ని లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించండి. తర్వాత ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసినా బొద్దింకలు వెళ్లిపోతాయి.

నీళ్లల్లో నిమ్మరసం కలిపి తరచూ ఇంట్లో బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో ఆ నీటిని చల్లుతూ ఉండాలి. వాటికి నిమ్మరసం వాసన నచ్చదు కాబట్టి ఇంట్లో నుంచి అవి వెళ్లిపోతాయి.

తమలపాకులను నీళ్లలో నానబెట్టి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ని ఒక చెంచా వేడినీటిలో కలిపి ఇంట్లో చల్లండి.

పొట్లకాయ తొక్కను పేస్ట్‌లా చేసి వేడినీటిలో కలపండి. తర్వాత ఈ నీటితో ఇంటిని శుభ్రం చేయండి.  

కిచెన్ ప్లాట్ ఫామ్ మీద బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి. కాబట్టి, ఒక వస్త్రంలో కిరోసిన్ ముంచి ఆ ప్లాట్ ఫామ్ ను తుడవండి. ఆ వాసన ఉన్నంత కాలం ఒక్క బొద్దింక కూడా అటు వైపు రాదు.