ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది, తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది.

కాఫీలోని కెఫిన్ స్కాల్ప్‌లో రక్త ప్రసరణను పెంచుతుంది.

ఇది జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్  పోషకాలను అందించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడుతుంది.

కాఫీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు స్కాల్ప్ ఇరిటేషన్‌ను తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి.

కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను డ్యామేజ్ నుండి రక్షిస్తాయి.

ఒక పాత్రలో నీరు పోసి, కాఫీ పొడి వేసి మరిగించండి.

ఆ కాఫీ డికాషన్‌ను చల్లార్చి తల్ల స్నానం చేసేటప్పుడు, ఈ డికాషన్‌తో జుట్టును కడిగి, స్కాల్ప్‌ను మసాజ్ చేయాలి

కొన్ని నిమిషాల తర్వాత, శుభ్రమైన నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి

ఈ పద్ధతి జుట్టుకు మృదుత్వాన్ని ఇవ్వడమే కాకుండా, జుట్టును బలంగా, ఒత్తుగా పెంచుతుంది.