వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు మాత్రమే కాదు అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
వర్షాకాలంలో ఇళ్లలో చీమల బెడద ఎక్కువ అవుతుంది. ఎరుపు లేదా నలుపు చీమలు ఎక్కువగా మన ఇళ్లలో, తోటలలో గూడు కట్టుకుంటాయి.
అయితే ఇంట్లో చీమలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇంట్లో దొరికే వస్తువులతో సింపుల్ చిట్కాలు పాటించి చూడండి.
స్ప్రే బాటిల్‌లో వెనిగర్, నిమ్మరసం. నీటిని కలపండి. ఇప్పుడు చీమల మీద ఈ ద్రావణాన్ని స్ప్రే చేస్తే చీమలు పోతాయి.
ఎండు మిరపకాయలు, దాల్చిన చెక్క , నిమ్మ తొక్కలను గది మూలలో ఒక గిన్నెలో ఉంచండి. ఇంట్లో చీమలు తగ్గుతాయి
చీమలు ఏ దారిలో వస్తున్నాయో గమనించి, ఆ దారిలో ఒక పసుపు గీత గీయండి లేదా ఉప్పును చల్లి పెట్టండి. చీమలు ఆ గీత దాటి లోపలికి రావు.
కొంచెం పుదీనా నూనె లేదా వేప నూనెను కాటన్ బాల్స్‌లో వేసి చీమలు వచ్చే మూలల్లో ఉంచండి. తలుపులు, కిటికీలు, వేదికల మూలల దగ్గర ఈ పద్ధతి వేసుకుంటే చీమలే కాదు, కొన్ని ఇతర కీటకాలూ దూరంగా ఉంటాయి.