వేసవిలో సన్‌స్క్రీన్ అప్లై చేయడం ఎంత ముఖ్యమో చాలా మందికి తెలుసు. కానీ,
వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అందుకే ప్రజలు సాధారణంగా వర్షాకాలంలో సన్‌స్క్రీన్ అప్లై చేయడం అనవసరం అనుకుంటారు.
ఆకాశంలో మేఘాలు ఉన్నప్పటికీ, కాంతి అంటే సూర్యకాంతి భూమిని చేరుకుంటుందని, దానితో పాటు UV కిరణాలు కూడా మానవులను చేరుకుంటాయని అర్థం.
UV కిరణాల నుండి రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం చాలా ముఖ్యం.
అందుకే వేసవిలో ఎంత ముఖ్యమో వర్షాకాలంలో కూడా సన్‌స్క్రీన్‌తో చర్మాన్ని రక్షించుకోవడం అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు.
యూవీబీ కిరణాలు సన్‌బర్న్, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. తేమ, వేడి చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. కాబట్టి, వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ తప్పనిసరి అని సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో ఆయిల్ బేస్డ్, వాటర్ బేస్డ్ సన్‌స్క్రీన్‌లతో పాటు, వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ఉపయోగించవచ్చు
మీకు ఏదైనా అలెర్జీ లేదా ఏదైనా చర్మ సంబంధిత సమస్య ఉంటే, వైద్యుడి సలహాతో సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి.