మహిళలకు రక్తహీనత ఉంటే శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

తగినంత రెస్ట్ తీసుకున్నా నిరంతరం నీరసంగా అనిపిస్తోందంటే రక్తహీనత ఉన్నట్టే

చర్మం పాలిపోయినట్టు ఉన్నా, గోళ్లు తెల్లబడుతున్నా ఒంట్లో రక్తం తగ్గినట్టే

మెట్లు ఎక్కేటప్పుడు, పని ఎక్కువైనప్పుడు శ్వాస అందనట్టు ఉన్నా రక్తహీనత ఉన్నట్టు అనుమానించాలి

రక్తహీనతతో ఒత్తిడి పెరిగి గుండె చలనంలో మార్పులు వస్తాయి. గుండె దడ మొదలవుతుంది. 

రక్తహీనత కారణంగా మెదడుకు రక్తసరఫరా తగ్గి నిత్యం తలనొప్పి వేధిస్తుంది

తల తిరుగుతున్నట్టు మూర్ఛ వస్తున్నట్టు ఉండటం కూడా రక్తహీనత లక్షణమే

రక్తహీనత ఉన్నప్పుడు రక్తప్రసరణ తగ్గి కాళ్లు, చేతులు సడెన్‌గా చల్లబడినట్టు అనిపిస్తాయి

తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం కూడా రక్తహీనతకు ఓ ముఖ్య సంకేతం