టీ ఎక్కువ తాగుతారా?
ఈ విషయాలు తెలుసుకోండి..
టీ ఎక్కువగా తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత మొదలై చర్మ సంబంధ సమస్యలు వేధిస్తాయి.
పరగడుపునే టీ తాగితే జీర్ణ వ్యవస్థ డిస్ట్రబ్ అవుతుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ మొదలవుతాయి.
టీలోని టనిన్స్ అనే రసాయనాలు ఐరన్ శోషణను తగ్గిస్తాయి. టీ ఎక్కువగా తాగే వారిలో హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది.
పరగడుపునే టీ తాగడం వల్ల కడుపులో వికారం మొదలవుతుంది. అసౌకర్యంగా ఉంటుంది.
ఉదయాన్నే టీ తాగితే రోజంతా ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, హార్ట్ బర్న్ వంటి సమస్యలు చికాకు పెడతాయి.
పాలతో చేసిన టీ ఉదయాన్నే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను పెంచేస్తుంది. ఫలితంగా చిరాకు, ఆందోళన వంటి మానసిక సమస్యలు వేధిస్తాయి.
పాలతో చేసిన టీ వల్ల మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు సరిగ్గా శోషణం కావు.
ప్రతిరోజూ ఉదయాన్నే టీ తాగడం వల్ల కెఫిన్ డిపెండెన్సీ మొదలవుతుంది. టీ తాగకపోతే తలనొప్పి, చిరాకు వచ్చేస్తాయి.
టీలో ఉండే కెఫిన్ డీ హైడ్రేషన్ సమస్యను కలిగిస్తుంది. డీ హైడ్రేషన్ ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది.
Related Web Stories
చిన్నతనంలోనే కోడింగ్ నేర్చుకుంటే కలిగే బెనిఫిట్స్
ఈ ఆకులు చాలా పవర్ఫుల్.. ఈ సమస్యలు దూరం..
పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే కలిగే బెనిఫిట్స్
15 రోజులు ఆయిల్ ఫుడ్ మానేస్తే.. మీ శరీరంలో జరిగేది ఇదే..