ఈ ఆకులు చాలా పవర్‌ఫుల్.. ఈ సమస్యలు దూరం..

రక్తంలో చక్కెర స్థాయులను సమర్థవంతంగా నియంత్రించడం, జీర్ణ సమస్యల నియంత్రణ, రోగ నిరోధక శక్తిని పెంచడంలో మూడు ఆకులు ప్రభావవంతంగా పని చేస్తాయి. 

జీర్ణ సంబంధ సమస్యలు, డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో ఆయుర్వేదం బాగా పని చేస్తోందని చాలా మంది నమ్ముతున్నారు.

కొన్ని ఔషధ గుణాలు కలిగిన మూలికలు చక్కెర వ్యాధిని సమర్థవంతంగా నియంత్రణలో ఉంచుతున్నట్టు తేలింది. 

ఆయుర్వేదిక్ నిపుణుడు ఆచార్య బాలకృష్ణ పరగడుపునే మూడు ఆకులను తింటే చాలా మంచిదని సూచిస్తున్నారు. 

పలు ఆరోగ్య సమస్యలను నియంత్రిస్తున్న ఆ మూడు ఆకులు తులసి, వేప, పుదీనా.

పరగడుపునే తులసి ఆకులను తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు దరి చేరవు. 

పరగడుపునే వేప ఆకులను తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. 

పరగడుపునే పుదీనా ఆకులను తినడం వల్ల గ్యాస్ సమస్య నియంత్రణలోకి వస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి. 

మన ఇంటి పరిసర ప్రాంతాల్లోనే దొరికే ఈ మూడు ఆకులు మనం నిత్యం ఎదుర్కొనే అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.