కరివేపాకు పచ్చడి ఇలా
చేస్తే అసలు వదిలి పెట్టరు..
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి.
తరువాత నువ్వుపప్పు
దోరగా వేగించాలి.
స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక శెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.
ఆ పోపును ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
అదే బాణలిలో ఎండుమిర్చి వేసి వేగించాలి. కాసేపయ్యాక కరివేపాకు వేయాలి.
చింతపండు వేసి స్టవ్‌పై నుంచి దింపాలి. చల్లారాక అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కలిపి పచ్చడి తయారీ చేసుకోవాలి.
Related Web Stories
ప్రపంచంలోనే ప్రమాదకరమైన 8 రోడ్లు ఏవో తెలుసా...
కొబ్బరి సేమియా పాయసం ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..
ప్రపంచంలోనే మారుమూల ప్రదేశాలు ఏవో తెలుసా..
భూమిపై సంవత్సరాలుగా మండుతున్న ప్రదేశాలు