కొబ్బరి సేమియా పాయసం  ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..

ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యివేసి సేమియా దోరగా వేగించి పక్కనుంచాలి. 

మరో కడాయిలో కొబ్బరిపాలు పోసి వేడిచేయాలి.

తర్వాత అందులో నీరు, బెల్లం వేసి అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. 

రెండు నిమిషాలయ్యాక సేమియా వేసి ఒక పొంగు రాగానే చిటికెడు ఉప్పు వేసి మంట తగ్గించాలి.

సేమియా చిక్కబడ్డాక జీడిపప్పు, కుంకుమపువ్వు కలిపి దించేయాలి. 

ఆ పాయసం మినప వడలతో కాంబినేషన్‌గా బాగుంటుంది.