మీ కారుకు సీటు బెల్ట్ ఉందా..

కారులో సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది.

సీటు బెల్ట్ ధరిస్తే కారు పల్టీ కొట్టినా చిన్న చిన్న గాయాలవుతాయి కానీ  శరీరం ఎగిరిపడదు.

అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ముందుకు పడే  అవకాశం ఉండదు.

సీటు బెల్ట్ పెట్టుకుంటేనే ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి.

 కొన్ని కార్లలో ముందు కూర్చున్న వారికి  మాత్రమే సీటు బెల్ట్ ఉంటుంది.

ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే కార్లలో అన్ని సీట్లకూ సీట్ బెల్ట్ ఉంటోంది.

వాహనం ప్రమాదానికి గురైన వెంటనే కారులోని సెన్సర్లు యాక్టివేట్ అయిపోయి ఓ యాంగిల్‌ను ఏర్పరుచుకుని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి.

కారు కొనుగోలు సమయంలో భద్రతపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నియమం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా వర్తిస్తుంది.