కాలీఫ్లవర్‌తో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వీటిల్లోని సల్ఫోరాఫేన్, గ్లైకోసిలేట్స్ అనే కాంపౌండ్స్ విషతుల్యాను నిర్వీర్యం చేస్తాయి. 

కాలీఫ్లవర్‌లోని యాంటీఆక్సిడెంట్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. 

ఇందులోని పీచు పదార్థంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది. 

కాలీఫ్లవర్‌లోని ఖోలిన్ అనే పోషకం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగై జ్ఞాపకశక్తి ఇనుమడిస్తుంది

ఇందులోని గ్లైకోసిలేట్ ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని మెరుపు పరిచి హార్మో్న్‌ల సమతౌల్యాన్ని సరిదిద్దుతుంది.

కెలొరీలు తక్కువగా నీరు, పీచు పదార్థం ఎక్కువగా ఉండే కాలీఫ్లవర్‌తో బరువు కూడా తగ్గుతారు. 

కాలీఫ్లవర్‌లోని విటమిన్ కే, కాల్షియం ఎముకలను మరింత దృఢంగా మారుస్తాయి. 

కాలీఫ్లవర్‌లోని సల్ఫోరాఫేన్‌కు క్యాన్సర్ నిరోధించే గుణం కూడా ఉంటుంది.