మంచి సువాసన కలిగించే పెర్‌ఫ్యూమ్ పొరపాటున ఈ శరీర భాగాలపై వేసుకుంటే మాత్రం చర్మానికి చాలా డేంజర్.
పెర్‌ఫ్యూమ్‌లో ఆల్కహాల్, ఇతర రసాయనాలు ఉంటాయి. ఇవి ముఖం, కళ్ళకు హానికలిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి.
అండర్ ఆర్మ్‌లకు ఎట్టి పరిస్థితుల్లో పెర్‌ఫ్యూమ్ పూయవద్దు. ప్రత్యేకించి షేవ్ చేసిన వెంటనే అస్సలు అప్లై చేయకండి. ఎందుకంటే ఇది చర్మంపై చికాకు, దద్దుర్లు కలిగిస్తుంది.
ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ పెర్‌ఫ్యూమ్ పూయడం చాలా హానికరం. ఇది చికాకుతో పాటు ఇతర చర్మ వ్యాధులు వచ్చేందుకు కారణమవుతుంది.
స్క్రాచ్ లేదా గాయం ఉన్న ప్రదేశానికి పెర్‌ఫ్యూమ్ రాయవద్దు. చికాకుతో, నొప్పిని కలిగి చెడు ప్రభావం చూపిస్తుంది.
నోరు, ముక్కు చుట్టూ పెర్‌ఫ్యూమ్ పూయడం మానుకోవాలి. పొరపాటున ఇలా చేస్తే ఇందులోని హానికరమైన రసాయనాలు నేరుగా శరీరంలోకి చేరి హాని కలిగిస్తాయి.
కడుపు, నాభి చుట్టూ ఉన్న చర్మం సున్నితంగా ఉంటుంది. ఇక్కడ పెర్‌ఫ్యూమ్ పూయడం అంత మంచిది కాదు.
చెవి లోపల లేదా చుట్టూ అప్లై చేయడం వల్ల చికాకు పట్టి క్రమంగా ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే, చెవి వెనుక పూయవచ్చు.
మీ చర్మంపై చెమట మరియు ధూళి ఉంటే, పెర్ఫ్యూమ్ రాయవద్దు. ఇది చికాకు మరియు సంక్రమణకు కారణమవుతుంది.