ఇంట్లో రెస్టారెంట్ స్టైల్ లో డిఫరెంట్‌గా కూరలను తయారు చేసుకోవచ్చు

తయారికీ కావల్సిన పదార్ధాలు టమాటా -2,అల్లం వెల్లుల్లి పేస్ట్,మిరియాల పొడి,ధనియా పొడి,జీలకర్ర పొడి కారం ,గరం మసాలా,నెయ్యి-,నూనె,ఉప్పు,కొత్తిమీర,ఫ్రెష్ క్రీమ్

స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పావు కప్పు జీడిపప్పు వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి.

పన్నీర్ ని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం వేడి నీరు వేసి ఉప్పు వేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక పది నిమిషాల తర్వాత పన్నీర్ శుభ్రంగా కడిగి కావాల్సిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.

స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి వేడి చేసి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేయించుకోవాలి.ఒక ప్లేట్ లోకి తీసుకోని. పాన్ లో నెయ్యి, కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి.

గోల్డెన్ బ్రౌన్ లోకి ఉల్లిపాయ ముక్కలు వచ్చిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి వేయించాలి. టమాటా మెత్త పడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

ఉల్లి టమాటా మిశ్రమంలో కొంచెం మిరియాల పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ ఉల్లి, టమాటా మసాలా పేస్ట్ వేయిస్తుంటే నూనె పైకి వస్తుంది.. 

వేయించి పక్కకు పెట్టుకున్న జీడి పప్పులను మిక్సీ చేసి క్రీమ్ గా చేసుకుని దీనిని మసాలా కూరలో వేసుకోవాలి.జీడిపప్పుని, వేయించిన పన్నీర్ వేసుకుని ఉడికించాలి. నూనె పైకి వచ్చే సమయంలో గరం మసాలా పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి.

చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ధాబా స్టైల్ లో కాజు పనీర్ మసాలా కూర రెడీ. దీనిని బిర్యానీ, చపతీ, నాన్, పరాటా లో వేసి సర్వ్ చేసుకోవాలి.