జుట్టు బాగా రాలుతోందా? అయితే
ఈ నీళ్లు తాగాల్సిందే..!
ఈ రోజుల్లో జుట్టు రాలడం, పెరగకపోవడం, బలహీనత వంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో సహజమైన మునగ ఆకుల నీరు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తాగడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.
మునగ ఆకులు విటమిన్ A, C, E, B లను అందిస్తాయి. ఇందులో ఐరన్, జింక్, అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి.
ఇవి అన్ని కలిసి జుట్టు మూలాలను బలంగా మార్చడంలో సహాయపడతాయి.
రెండు కప్పుల నీటిని మరిగించాలి. నీరు మరిగిన తర్వాత అందులో ఆకులను వేసి 10 నిమిషాలు ఇంకా మరిగించాలి.
వడకట్టి నీరు చల్లార్చి తాగాలి. దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే బాగా పని చేస్తుంది.
మునగ నీటిని తాగడమే కాకుండా.. తల కడుక్కోవడానికి కూడా వాడొచ్చు.
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.
Related Web Stories
కలలో పక్షులు కనిపిస్తున్నాయా..కనిపిస్తే ఏ అర్ధమో తెలుసా..
పాలను కచ్చితంగా వేడి చేయాల్సిందేనా..
10 నిమిషాల్లో జిలేబి ని ఇంట్లోనే చాలా ఈజీ గా చేసుకోవచ్చు
ఆ అలవాట్లు.. మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి