బట్టలపై మరకలు చిటికెలో  ఇలా మాయం..

కొత్త గుడ్డపై ఏదైనా రకమైన మరక ఉంటే, అది పనికిరాదని భావించి ధరించడం మానేస్తాము.

ఈ స్పెషల్ ఫార్ములాతో ఆ మరకకు చెక్ పెట్టొచ్చు. దీంతో బట్టలు తిరిగి మెరుస్తాయి.

కట్ చేసిన నిమ్మకాయను ఉప్పుతో రుద్దిన ప్రదేశంలో రుద్దాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే బట్టలపై ఉన్న మొండి మరకలు తొలగిపోతాయి.

 గోరువెచ్చని నీటితో కూడా సాధారణ మరకలను శుభ్రం చేయొచ్చు.

దుస్తులపై పాన్, గుట్కా మరకలు పడినట్లయితే భయపడాల్సిన పనిలేదు. ఈ మరకలను పెరుగుతో తొలగించొచ్చు.

ఇందుకోసం చొక్కాను బాగా పులిసిన పెరుగు, మజ్జిగలో నానబెట్టాలి. 15 నుంచి 20 నిమిషాల తరువాత మరక ఉన్న ప్రదేశాన్ని రుద్దాలి.

కిచెన్‌లో ఉండే పుల్లటి వస్తువులు బట్టలపై ఉన్న మొండి మరకలను పోగొట్టడంలో అద్భుతంగా సహాయపడుతాయి.