మహా కుంభమేళాకు 20 రోజుల్లో  వచ్చిన జనం అమెరికా జనాభాతో  దాదాపుగా సమానమన్న ఉప రాష్ట్రపతి

త్రివేణీసంగమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ పుణ్యస్నానం చేశారు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కుంభమేళా ఏర్పాట్లు అద్భుతంగా చేసారని అభినందించారు

మీడియాతో ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ ఇది చరిత్రాత్మకం 

ఇప్పటివరకు ఇంతమంది ప్రజలు భూమి మీద ఎక్కడా ఒకచోటుకు చేరలేదు

అధికార యంత్రాంగం గొప్పగా పనిచేస్తోంది

భారత్‌లో ఇటువంటి కార్యక్రమం ఒకటి నిర్వహిస్తామని నేనైతే ఊహించనైనా లేదు

తొక్కిసలాట వంటి విషాద ఘటన జరిగినా, సమర్థవంతంగా అన్నీ చక్కదిద్దారు

అంకితభావం, సామర్థ్యం, సాంస్కృతిక విజ్ఞానం, జాతికి సేవ చేయాలన్న తపన ఉంటే

అద్భుతాలు జరుగుతాయని యోగీజీ నిరూపించారు అంటూ ఉప రాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించారు