మీ ముఖం మెరిసిపోవాలనుకుంటున్నారా, గంజినీటిలో వీటిని కలిపి అప్లై చేస్తే..
గంజినీటిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇది బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
ఇది విటమిన్ బితో సహా అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది
దీనిని వాడడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది.
చర్మ సౌందర్యానికి తేనె బాగా హెల్ప్ చేస్తుంది. ఇది చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది
తేనెలో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.
ఇది సహజంగా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీంతో పాటు చర్మాన్ని బ్యాలెన్స్ చేసి సెబమ్ ప్రొడక్షన్‌ని తగ్గిస్తుంది.
నిమ్మరసంలో ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది చర్మానికి మంచి శక్తిని, మెరుపుని ఇస్తుంది.
జిడ్డు చర్మానికి నిమ్మరసం మంచిది. నిమ్మరసం చర్మానికి మేలు చేస్తుంది. కాబట్టి, దీనిని కూడా ముఖానికి రాయొచ్చు. అయితే, నేరుగా రాయొద్దు. ఎందులోనైనా కలిపి రాయాలి.