కూరలో కారం ఎక్కువైందా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసం..

 కొన్ని సార్లు కూరలు తయారు చేసే సమయంలో అవసరమైన దానికంటే పొరపాటున కూరలో కారం  ఎక్కువగా పడుతుంది

టమాటో పేస్ట్ ని తయారు చేసి దానిని బాణలిలో వేసి కొంచెం నూనె వేసి వేయించాలి

 ఆ పేస్ట్ ను వండిన కూరలో కలిపి కొంచెం వేగనివ్వాలి.

కారం తగ్గించడానికి నెయ్యి లేదా వెన్నని జోడించవచ్చు. దీనివల్ల కూర రుచి పెరగడమే కాకుండా కారం తగ్గుతుంది.

ఆహారంలో కారం ఘాటుని తగ్గించడానికి బియ్యం పిండి ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది 

 3 నుండి 4 స్పూన్ల పిండిని కొంచెం నూనెలో వేయించాలి

తయారు చేసిన కూరలో ఈ వేయంచిన పిండిని జోడించండి. వెజిటబుల్ గ్రేవీ పిండి సహాయంతో చాలా చిక్కగా రుచికరంగా ఉంటుంది.