ఈ టిప్స్ పాటిస్తే..  ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఈజీ..

 ఇంగ్లీష్ ను అంతర్జాతీయ భాష అంటారు. ఇంగ్లీష్ వచ్చిన వారికే పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలు ఉంటాయి.

 సినిమాలకు, వెబ్ సిరీస్ లకు సబ్ టైటిల్స్ ఆన్ చేయాలి. అందులో నటుల మాటలు అనుసరిస్తూ సబ్ టైటిల్స్ చదువుతూ ఇంగ్లీష్ మాట్లాడుతుండాలి. 

సింగింగ్ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఇంగ్లీష్ పాటలు వింటూ తర్వాత దాన్ని అనుసరించి పాడుతూ ఉంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది.

ఏకాంతంగా ఉన్న సమయంలో అద్దంలో చూసుకుంటూ ఇంగ్లీష్ లో మీతో మీరు మాట్లాడాలి.

మీతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడే మాటలు రికార్డ్ చేసుకోవాలి. అందులో ఎంతవరకు తప్పులు ఉన్నాయో తర్వాత చెక్ చేసుకోవాలి.

ఇంగ్లీష్ బాగా మాట్లాడగల స్నేహితుల సహాయం తీసుకోవాలి. వారితో ఇంగ్లీష్ లో మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి.

చిన్న పిల్లల పుస్తకాలలో కథలను అర్థవంతంగా చదివడం అలవాటు చేసుకోవాలి. ఇది ఇంగ్లీష్ మీద పట్టు పెంచుతుంది.