నూనె లేకుండా స్పైసీ చికెన్ కర్రీ
ఎలా తయారుచేయాలంటే..!
ఈ సులభమైన వంటకాన్ని చేయడానికి చికెన్ ముక్కలను కడిగి, శుభ్రం చేసి, కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక గిన్నె తీసుకుని చికెన్ ముక్కలును ఉప్పు, మిరియాలు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన కరివేపాకు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, పసుపు, ఉప్పు, మసాలా పొడులతో పాటు పెరుగును కలిపి ఉంచాలి.
పైన కలిపి ఉంచిన మిశ్రమాలను చికెన్‌తో కలిపి మ్యారినేట్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
నాన్ స్టిక్ పాన్ లో చిన్న మంట మీద వేడి చేసి అందులో చికెన్ ముక్కలను వేసి తక్కువ మంటమీద ఉంచాలి.
చికెన్ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత, ఫ్రెష్ క్రీం వేసి, గ్రేవీ చిక్కగా మారేంత వరకూ కూరను ఉడికించాలి.
ఇది అన్నం, రోటీలలోనికి వేడిగా తినేందుకు బావుంటుంది.
Related Web Stories
సాక్స్‌లు ధరించకుండా షూ వేస్తున్నారా ఎమవుతుందో తేలుసా...
సౌందర్య పోషణకు పసుపు, నూనె
షాంపూతో ఎలుకలు ఇంట్లోకి రాకుండా చేయొచ్చు
మీ బ్లడ్ షుగర్‌ను వెంటనే తగ్గించే దివ్యౌషధం ఇదే..