నూడుల్స్‌తో సమోసా  ట్రై చేశారా..

ముందుగా స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి.

 తరువాత క్యారెట్‌ ముక్కలు, క్యాప్సికం, క్యాబేజీ తురుము వేసి మరికాసేపు వేగించుకోవాలి.

తగినంత ఉప్పు వేసి, సోయాసాస్‌, వెనిగర్‌, ఉడికించిన నూడుల్స్‌ వేసి కలుపుకోవాలి.

కాసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

ఒక ప్లేట్‌లో మైదా, గోధుమపిండి వేసి, తగినంత ఉప్పు, వాము, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి.

ఈ పిండిని అరగంటపాటు పక్కన పెట్టాలి.

ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీల్లా చేసుకోవాలి. 

 తరువాత సగానికి కట్‌ చేసుకోవాలి. ఆ భాగాన్ని మళ్లీ సగానికి కట్‌ చేయాలి. 

తరువాత ఒక భాగం తీసుకుని మధ్యలో నూడుల్స్‌ మిశ్రమం పెట్టి చివర్లు నూనె లేదా నీటితో అద్దుతూ మూసేయాలి. 

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక సమోసాలు వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా ఏదైనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.