ధనవంతులు కావాలనుకుంటున్నారా? గోయెంకా చెప్పిన ఈ టిప్స్ ఫాలోకండి..
ధనవంతులు కావడం ఎలా? అనేది చాలా పెద్ద చిక్కు ప్రశ్న. ఆ ప్రశ్నకు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గోయెంకా సమాధానం చెప్పారు.
సంపద కూడబెట్టుకునేందుకు సహకరించే ఆరు సూత్రాలను హర్ష్ గోయెంకా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఆదాయాన్ని అందించే ఆస్తులను కూడబెట్టాలి. స్టాక్స్, రియల్ ఎస్టేట్, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి.
ఆదాయం కంటే ఖర్చులు ఎప్పుడూ తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి.
కేవలం ఆదాయం కోసం కాకుండా సంపద సృష్టిపై దృష్టి పెట్టి పని చేయాలి. సరికొత్తగా ఆలోచించాలి.
ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోవాలి. పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, సంపద పెంచే స్ట్రాటజీల గురించి అధ్యయనం చేయాలి.
కేవలం ఆదాయం కోసం కాకుండా కొత్త విషయాలు నేర్చుకునేందుకు పని చేయడం అలవాటు చేసుకోవాలి.
భవిష్యత్తులో డిమాండ్ ఉండే అంశాలను ముందుగానే గుర్తించి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి.
హర్ష్ గోయెంకా చెప్పిన ఈ ఆరు సూత్రాలను ఆచరణలో పెట్టి సంపన్నులు కావడానికి ప్రయత్నాలు ప్రారంభించండి.
Related Web Stories
దోశతో వెయిట్ లాస్ అవ్వొచ్చన్న సంగతి మీకు తెలుసా?
నూనె ఇలా రాస్తే పెరగే జుట్టు ను ఎవరు ఆపలేరు
ఈ మందులు అతిగా వాడుతున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి!
బరువు తగ్గట్లేదా? అయితే కారణమిదే..!