ప్రజెంట్ ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు.

పోషకాహారం తీసుకోకపోవడం, సరైన లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వకపోవడం, నీరు తాగకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, పొల్యూషన్ ఈ కారణాలన్నింటి వల్ల జుట్టు చాలా రాలిపోతుంది. 

జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరగాలంటే పైన చెప్పిన తప్పులని అవాయిడ్ చేస్తూ మంచి లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. దీంతో పాటు హెయిర్ కేర్‌ పాటించాలి.

హెయిర్‌కేర్‌లో ముఖ్య భాగం జుట్టుకి ఆయిల్ మసాజ్ చేయడం. జుట్టు పొడుగ్గా పెరిగేందుకు నూనె బాగా హెల్ప్ చేస్తుంది.

అందుకోసం నూనెని ఇష్టంగా రాయడం కాదు. సరిగ్గా రాయాలి.జుట్టుకి పోషణ అంది పొడుగ్గా పెరుగుతుంది.

ముందుగా జుట్టుకి నూనె రాయడానికి సరైన నూనెని ఎంచుకోండి. ఎప్పుడు ఒకే నూనె రాస్తామంటే కుదరదు

చలికాలంలో హెయిర్ ఎక్కువగా డ్రై అవుతుంది. కాబట్టి, మీరు రాసే ఏదైనా నూనెలో ఆముదం కలపండి.

వేసవిలో అయితే లైట్‌గా ఉండే ఆయిల్స్ ఎంచుకోండి. ఇలా ట్రై చేస్తే జుట్టు చిక్కుల్లేకుండా అందంగా పొడుగ్గా పెరుగుతుంది.

కొద్దిగా గోరువెచ్చగా చేసి ఆ తర్వాత నూనె రాయండి. దీంతో నూనె నేరుగా కుదుళ్ళలోకి చొచ్చుకుని పోతుంది.