లిప్‌స్టిక్ కలర్‌తో ఆడవారి  మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు..

లిప్ స్టిక్ పెదవుల అందాన్ని పెంచే అందమైన ప్రోడెక్ట్.. దీనిని పెదవులకు పూసుకోవడం వల్ల పెదవులు మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 

అయితే.. మనం పెదవులకు ఎలాంటి కలర్ ఎంచుకుంటామో అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చేస్తుందట. అదెలాగంటే..

పింక్ కలర్.. ఇది ఎనర్జిటిక్ గా ఉంటారు. బబ్లీ నేచర్ ఉంటుంది. అమాయకంగా కనిపిస్తారు. సాహసోపేతమైన మనస్తత్వం కలిగి ఉంటారు.

 బ్రౌన్ లిప్ స్టిక్..బలమైన, నమ్మకమైన మనస్తత్వంతో ఉంటారు. భావోద్వేగాలను అణుచుకునే వారు.

లైట్ పింక్ కలర్ లిప్ స్టిక్ వేసుకునే మహిళల విషయానికి వస్తే.. క్లాసిక్ లుక్ తో పాటు డిగ్నిటీ కోరుకుంటారు.

పెదవులకు రంగు పూసుకునే వారితో పోల్చితే.. లిప్ స్టిక్ వేసుకోని వారు ఎలా ఉంటారంటే..

సహజమైన పెదవులని కలిగిన స్త్రీలు గందరగోళానికి గురికాకుండా ఉంటారు.