సహజ పదార్థాలతో ఇంట్లో ఫేస్  ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చు.

ముఖానికి కాంతి రావడానికి శనగపిండి, పసుపు, రోజ్ వాటర్, పాల మీగడ, తేనె కలిపి చేసిన ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించవచ్చు.

ఈ ప్యాక్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది, మెరిసేలా చేస్తుంది

మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది.

ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ చర్మానికి గ్లో ఇస్తుంది.

ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి, పసుపు, కొద్దిగా రోజ్ వాటర్, పాల మీగడ,  తేనె వేయండి.

ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక ప్యాక్‌లా తయారు చేయండి

మీ ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత, ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయండి

15 నుండి 20 నిమిషాలు ఆరనిచ్చి తరువాత చల్లటి నీటితో లేదా గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయండి.

మెరిసే చర్మం కోసం, ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించవచ్చు.