తెల్ల జుట్టు నల్లగా మారడానికి..  ఈ నేచురల్ టిప్స్ పాటించండి..!

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడానికి వారసత్వం, ఊబకాయం, స్మోకింగ్, ఒత్తిడి, హార్మోన్ల లోపం కారణాలు. 

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా మీ జుట్టును నల్లగా మార్చుకోవడానికి కొన్ని టిప్స్ పాటించి చూడండి.. 

కరివేపాకును దంచి, పెరుగుతో కలపి పేస్ట్‌లా చేసుకుని దానిని వారానికి రెండు సార్లు తలకు పట్టించండి. 

టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్‌ను వేడి నీటిలో కలిపి చల్లార్చాలి. తర్వాత దానికి హెన్నా పౌడర్‌ను కలిపి కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఏదో ఒక నూనెలో కలిపి తలకు పట్టించాలి. 

మందార పువ్వులను పొడిలా చేసి కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. 

వారానికి రెండు సార్లు నల్ల నువ్వులు తినడం వల్ల హార్మోన్ల సమతుల్యం జరిగి మీ జట్టు నల్లగా మారుతుంది. 

ఉసిరి నూనెతో మీ తలను మసాజ్ చేసుకోండి. కొబ్బరి నూనెలో ఎండిన ఉసిరి పండును వేసి మరగబెట్టి జుట్టుకు రాయండి

అశ్వగంధ వేరు పొడి, బ్రహ్మీ పొడిని కలిపి జుట్టుకు రాసుకుంటే కుదుళ్లకు రక్తప్రసరణ పెరుగుతుంది. 

బృంగరాజ్ ఆకులను రాత్రంతా నూనెలో నానబెట్టి ఉదయాన్నే తలకు రాసుకోండి. మీ జట్టు పెరగడమే కాకుండా నిగినిగలాడుతుంది.