రోజూ ఉదయం 10 నిమిషాల పాటు యోగా చేస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

యోగాతో మానసిక ప్రశాంతత పెరిగి రోజును స్థిర చిత్తంతో ప్రారంభించగలుగుతారు. 

యోగాతో ఊపిరితిత్తుల బలం పెరుగుతోంది. ఆక్సీజన్ తగినంతగా అంది అలసట దరిచేరదు

పట్టేసినట్టు ఉన్న కండరాలు యోగాతో రిలాక్స్ అయ్యి ఒంటి నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది.

యోగాతో మనసు నిర్మలమై ఆలోచనల్లో స్పష్టత, త్వరితంగా నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతాయి. 

ఒత్తిడి కారక హార్మోన్ కార్టీసాల్‌ ప్రభావాన్ని తగ్గించడంలో యోగాది కీలక పాత్ర

యోగాసనాల వల్ల ఉదర భాగంలోని కండరాలు క్రియాశీలకమై జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.  

యోగాతో వెన్నెముకకు కూడా బలం చేకూరి వృద్ధాప్యంలో నడుము ఒంగిపోయే ప్రమాదం తప్పుతుంది.