ఇలా చేస్తే ఇంట్లో ఒక్క ఎలుక  కూడా ఉండదు..

ఇంట్లో ఎలుకల బాధ తట్టుకోలేకపోతున్నారా . ఎన్ని విధాలుగా ప్రయత్నించిన ఎలుకల సమస్య వదలట్లేదా. అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి.

పుదీనా నూనెను కలిపి ఇంటి మూలల్లో స్ప్రే చేయండి. ఈ ద్రావణం ఎలుకలను దూరంగా ఉంచడమే కాకుండా ఇంటికి తాజా వాసనను కూడా ఇస్తుంది.

ఎలుకలు ఉండే చోట్ల ఎర్ర కారం  నీటిలో కలిపి స్ప్రే తయారు చేసి ఎలుకలు వచ్చి వెళ్ళే ప్రదేశాలలో చల్లండి

కర్పూరం నీటిలో వేసి పిచికారీ చేయండి. కర్పూరం పొగ ఇంట్లో వ్యాపింపచేయడం ద్వారా ఎలుకలను తరిమికొట్టవచ్చు

నిమ్మకాయ, నారింజ తొక్కలను ఎండబెట్టి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఎలుకల స్థావరాల వద్ద ఉంచండి. దెబ్బకు ఎలుకలు ఇంట్లో నుంచి ఎలుకలు పారిపోతాయి.

అమ్మోనియా వాసన ఎలుకలకు సరిపడదు.  నీటిలో అమ్మోనియా కలిపి స్ప్రే తయారుచేసుకోండి. ఈ ద్రవాన్ని బాటిల్‌లో నింపి ఎలుకల దాగి ఉన్న ప్రదేశాల దగ్గర పిచికారీ చేయాలి.

ఈ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.