శరీరంలో పదే పదే కొన్ని భాగాల్లో నొప్పి వస్తుంటే అది చివరకు గుండె సమస్యలకు దారి తీయొచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పదే పదే ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున తీవ్రమైన నొప్పి, ఒత్తిడి, మండుతున్నట్లుగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
దవడ లేదా గొంతు నొప్పి కూడా కొన్నిసార్లు గుండె సమస్యలకు దారి తీస్తుంది. స్త్రీలలో ఎక్కువగా ఛాతి నొప్పికి బదులుగా దవడ నొప్పి వస్తుంటుంది.
నొప్పి ఛాతీలో ప్రారంభమై ఎడమ చేయి లేదా భజం వరకు పాకుతుంది. కొన్నిసార్లు వేళ్ల వరకూ వ్యాపిస్తుంది. ఇలా ఉంటే అశ్రద్ధ చేయొద్దు.
పదే పదే ఎగువ వెన్ను నొప్పి వస్తోందంటే గుండెకు రక్త ప్రసరణ సరిగా జరగలేదని అర్థం.
అకస్మాత్తుగా బరువుగా అనిపించడం, ఉబ్బరం, కడుపు నొప్పితో పాటూ వికారంగా ఉన్నా వైద్యుడిని సంప్రదించాలి.
శరీరంలో అన్ని నొప్పులూ గుండె సమస్యకు కారణం కాకపోవచ్చు. అయితే ఇలాంటి నొప్పులు పదే పదే వస్తుంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Related Web Stories
ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతున్నారా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
నిద్రపోయేప్పుడు మ్యూజిక్ వినే అలవాటు ఉందా?
ఓట్స్ ఇడ్లీ.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
షుగర్ వ్యాధిగ్రస్తులు.. తినాల్సిన కూరగాయలు ఇవే..