నిద్రపోయేప్పుడు మ్యూజిక్ వినే
అలవాటు ఉందా?
చాలామందికి నిద్రపోయేప్పుడు మ్యూజిక్ వినే అలవాటు ఉంటుంది. కొందరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరీ పాటలు వింటూ నిద్రపోయేందుకు ప్రయత్నిస్తారు.
నిద్రపోతున్నప్పుడు మెదడుకు విశ్రాంతి అవసరమైనప్పుడు, నిరంతరం సంగీతం ప్లే చేయడం వల్ల మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోతుంది.
చిరాకు, ఆందోళన వంటి యాంగ్జైటీ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి అతిగా వాడడం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.
గంటల తరబడి ఇయర్‌ఫోన్‌లు ధరించడం వల్ల వినికిడి సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది.
ఎక్కువసేపు ఇయర్‌ఫోన్‌లు ధరించడం వల్ల చెవుల్లోకి గాలి చేరదు. ఫలితంగా చెవిలో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది.
అధిక వాల్యూమ్ లేదా తక్కువ పౌనఃపున్యం గల ధ్వని తరంగాలు మెదడులోని నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. తద్వారా ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి.
వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల నుండి వెలువడే తక్కువ స్థాయి రేడియేషన్ శరీరానికి ఎక్కువసేపు బహిర్గతమైతే నాడీ సంబంధిత ఆటంకాలు ఏర్పడతాయి.
పడుకునే ముందు 10-15 నిమిషాలు మాత్రమే సంగీతం వినండి. గదిలో ఇయర్‌ఫోన్‌లకు బదులుగా తక్కువ వాల్యూమ్‌లో సంగీతాన్ని ప్లే చేయండి.
Related Web Stories
ఓట్స్ ఇడ్లీ.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
షుగర్ వ్యాధిగ్రస్తులు.. తినాల్సిన కూరగాయలు ఇవే..
బాత్రూంలో ఫోన్ వాడుతున్నారా?
జీవితాన్ని మార్చేసే ఈ మైక్రో హ్యాబిట్స్ గురించి తెలుసా