ఓట్స్‌ ఇడ్లీ.. ఇంట్లోనే  తయారు చేసుకోండిలా..

ముందుగా ఓట్స్‌ను మెత్తటి పిండిలా గ్రైండ్‌ చేసుకోవాలి.

ఓ బాణలిలో రవ్వ  వేసి వేయించాలి.

రవ్వ వేగాక ఓట్స్‌ పిండిని కూడా కలిపి ఓ అయిదు నిమిషాలు వేయించాలి.

ఇది చల్లబడ్డాక  క్యారట్‌ తురుము, వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం,  మిర్చి తరిగి వేయాలి.

ఉప్పు, మిరియాల పొడి వేసి, పెరుగు చేర్చి పోపు పెట్టాలి. 

 ఈ మిశ్రమాన్నంతా  బాగా కలపాలి. 

నీటిని కూడా కలిపి జారుగా కలియబెట్టి ఓ అయిదు నిమిషాలు మూతపెట్టి ఉంచాలి.

నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఈ మిశ్రమాన్ని వేసి పదిహేను నిమిషాలు ఉడికించాలి.

అంతే టేస్టీ... హెల్దీ ఓట్స్‌ ఇడ్లీ రెడీ.