రాత్రి పడుకునే సమయంలో ముఖంపై పాలు, కలబంద మిశ్రమాన్ని రాసి, ఉదయం కడుక్కోవాలి.

ఇలా చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ మిశ్రమాన్ని ముఖంపై రాయడం వల్ల చర్మానికి తేమ, పోషణ లభిస్తుంది.

కలబంద చర్మాన్ని చల్లబర్చడంతో పాటూ హైడ్రేట్ చేస్తుంది.

పాలు చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటూ ప్రకాశవంతంగా మారుస్తాయి.

పాలలోని లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, డెడ్ స్కిన్‌ను తొలగిస్తుంది.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయడం వల్ల ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గి చర్మం బిగుతుగా మారుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.