గుండు కొట్టించుకుంటే  దట్టమైన జుట్టు వస్తుందా?

కొందరు గుండు కొట్టించుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా పెరుగుతుందని భావిస్తారు.

గుండు కొట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందా?" అంటే.. నిపుణుల నుంచి 'NO' అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది

తలను షేవ్ చేయించినప్పుడు మృత వెంట్రుకల కణాలు పూర్తిగా తొలగిపోతాయి...

దాంతో.. గుండు తర్వాత పెరిగే వెంట్రుకలు సూర్యరశ్మికి లేదా ఇతర రసాయనాలకు గురికావు.

 షేవ్ చేసిన తర్వాత ముందు కన్నా కాస్త నల్లగా గుండు కనిపిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకానీ జుట్టు మందంలో ఎలాంటి తేడాలు ఉండవంటున్నారు.

జుట్టు ఒత్తుగా పెరగడంలో తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు.

విటమిన్ ఎ, సి, డి, ఇ, బయోటిన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు.