సంక్రాంతికి ఆనవాయితీగా  కొన్ని వంటలు  వండడం జరుగుతుంది. 

తెలుగు రాష్ట్రాల్లో  కలగూర కూర ప్రత్యేకం సంక్రాంతి రోజు దినిని తింటారు   

మెంతికూర,తోటకూర,చుక్కకూర,సొరకాయ,వంకాయ,ములక్కాడ,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,టమాటో, బెండకాయి,చిలగడదుంప

కాయగూరలు ముక్కలు కట్ చేసినవన్ని ఒక గిన్నెలో వేసి కుక్కర్ లో పెట్టి ఉడకబెట్టాలి

చింతపండు కడిగి ననబెట్టి పెట్టుకోవాలి 

ఒక గిన్నెలో  నూనె పోసి మెంతులు వేసి కట్‌చేసి పెట్టుకున్న ఉల్లిపాయి,పచ్చిమిర్చిముక్కలు వేసి వేగనివ్వాలి

బాగా వేగాక టొమాటో ముక్కలు వేసి ఇవి కూడా బాగ వేగాక ఉడకబెట్టిన ముక్కలను వేసి అవి అన్ని కొచ్చం నూనెలో వేగనివ్వాలి

పసుపు,కారం,ఉప్పు, అల్లం వెల్లలిపేస్టు, దనియాల పౌడర్ బాగా కలిపి కొంచెం నీళ్లు పోసి మరుగించాలి

వాటిలో చింతపండు పులుసు వేసి నూనె తేలేవరకు మరగనివ్వాలి 

రుచికరమైన కలగూర కూర రెడీ