కెరీర్‌లో దూసుకుపోయేందుకు కావాల్సిన పునాది కాలేజీ చదువు

అయితే, కాలేజీ దశలో విద్యార్థులు తెలిసీతెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. 

టైం టేబుల్ ఫాలో కాకుండా చాలా మందిని చదువును వాయిదా వేసి చివరి నిమిషంలో హడావుడి పడుతుంటారు

సరదాల పేరిట చాలా మంది క్లాసులు ఎగ్గొడుతూ తమ కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకుంటూ ఉంటారు

కేవలం చదువుపైనే ఫోకస్ పెట్టే కొందరు నెట్వర్కింగ్‌ను నిర్లక్ష్యం చేసి విలువైన అవకాశాలు కోల్పోతారు

దుబారా ఖర్చులు చేసి కొందరు కాలేజీ రోజుల్లో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటారు

పరిపూర్ణ వ్యక్తిత్వం కోసం చదువులతో పాటు ఆటపాటలు ఇతర వ్యాపకాలు ముఖ్యమన్న విషయాన్ని కొందరు పట్టించుకోరు.

ఈ తప్పులు చేయకుండా ఉంటే విద్యార్థి దశలోనే బంగరు భవితకు బాటలు వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు