సంక్రాంతి పండుగ రోజు ఈ వస్తువులు  దానం చేస్తే.. రాహు దోషం నుండి బయటపడతారట..!

మకర సంక్రాంతి రోజు నదీ స్నానం చేయడం శ్రేయస్కరం.  వీలైన వారు పారే నీటిలో స్నానం చేస్తుంటారు. 

స్నానం చేసిన తరువాత నల్ల నువ్వులను నీటిలో వదలాలట. నువ్వులు శని దేవుడికి ప్రీతికరం అని చెబుతారు. 

 మకర సంక్రాంతి రోజు గంగాజలంలో నల్ల నువ్వులు కలిపి శివుడికి నువ్వుల నీటితో అభిషేకం చెయ్యాలి

రావి చెట్టు దగ్గర ఆవనూనెతో దీపం వెలిగించడం చేయాలి. అలాగే రావి చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి.

 ఇలా చేస్తే కేవలం శని బాధలు తొలగడమే కాకుండా  గ్రహ బాధలు తొలగడం, తలపెట్టిన పనులు పూర్తీ కావడం, శివుడి అనుగ్రహం కలుగుతాయి.

 మకర సంక్రాంతి రోజు అర్ఘ్యం సమర్పించడం వల్ల జాతకంలో సూర్య స్థానం బలపడుతుందట. 

 దీనివల్ల తలపెట్టిన పనులలో విజయం కూడా సాధించగలరట. శని దోషాలు కూడా తొలగిపోతాయట.

సంక్రాంతి పండుగ రోజు బెల్లం, నువ్వులు,  పొంగలి,  నూలు వస్త్రాలు,  దుప్పట్లు మొదలైనవి పేదలకు దానం చేయాలి