ఈ పక్షులు ప్రపంచంలోనే  అత్యంత అందమైనవి..

ఈ భూమిపై అందమైన పక్షులు చాలా ఉన్నాయి. అందులో కొన్ని భిన్నంగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షులు వాటిని చూడాలంటే అదృష్టం ఉండాలి.

భారత జాతీయ పక్షి నెమలి.. ఇది ప్రపంచంలోనే అందమైన పక్షిగా నిలిచింది. ప్రపంచంలో మూడు రకాల నెమళులు ఉన్నాయి.

ఫ్లెమింగో ప్రపంచంలోని అత్యంత అందమైన పక్షులలో ఒకటి. దాని పొడవాటి కాళ్ళు, నారింజ, క్రీమ్ షేడ్స్‏లో ఉంటాయి.

కీల్ బిల్ టక్కన్ పక్షి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నల్ల పక్షులలో ఒకటి. దీనికి ఉన్న పొడవైన ముక్కు వలన దీనిని ప్రపంచంలోనే అత్యంత అందమైన పక్షిగా నిలిచింది.

ఎరుపు చిలుక (స్కార్లెట్మాకా) ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన చిలుక. దీనికున్న ఎరుపు రంగు ఎంతో అందంగా కనిపిస్తుంది

రెయిన్బో లోరికెట్ ఈ భూమిపై అత్యంత అందమైన పక్షులలో ఒకటి. రెయిన్బో లోరికెట్ అనేది ఆస్ట్రేలియాలో కనిపించే చిలుక జాతి.