స్నానం చేసిన వెంటనే  ఈ పని చేయకండి..!

స్నానం చేసిన వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్నానం సమయంలో శరీర ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. బాగా వేడిగా ఉన్నప్పుడు చల్లటి నీరు తాగితే ఆకస్మికంగా శరీర ఉష్ణోగ్రతలో మార్పు చోటుచేసుకుంటుంది

ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. ముఖ్యంగా, రక్తప్రసరణ వేగంగా జరిగే సమయంలో చల్లటి నీరు తాగితే గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.

స్నానం చేసిన తర్వాత మన శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా నీరు తాగితే రక్త నాళాలపై ఒత్తిడి పెరిగి చలికి గురయ్యే అవకాశం ఉంది.

ఇది తలనొప్పి, నీరసం, అలసట వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల స్నానం చేసిన వెంటనే నీరు తాగకుండా 10-15 నిమిషాల గడువు తీసుకుని తాగడం ఉత్తమం.

కేవలం స్నానం చేసిన వెంటనే మాత్రమే కాదు.. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

నిపుణుల సూచన ప్రకారం భోజనం చేసిన 30-45 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి.

వ్యాయామం చేసిన వెంటనే చల్లటి నీరు తాగకుండా కొద్దిగా గోరు వెచ్చటి నీరు తాగాలి.