రాత్రి అన్నంతో ప్యాన్‌కేక్..
తయారీ ఇలా..
గిన్నెలో అన్నం, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తరుగు, ఉల్లికాడ తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.
అందులోనే గోధుమపిండి, శనగపిండి, పసుపు, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పెరుగు, ఉప్పు, కొత్తిమీర వేసుకుని మరోసారి కలపాలి.
అనంతరం పావు కప్పు నీళ్లు పోసుకుని ముద్దలాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమం చపాతీ పిండి కన్నా కాస్త మెత్తగానే ఉండాలి.
పిండి మీద తడిగుడ్డ కప్పేసి కనీసం పావుగంట సేపు పక్కన ఉంచుకోవాలి.
పిండిని సమాన భాగాలుగా చేసుకుని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి బాగా నూనె రాయాలి. తరువాత పిండి ఉండను కవర్‌పై పెట్టి చేత్తోనే వెడల్పుగా పరాటా సైజులో చేసుకోవాలి.
స్టవ్‌పైన పెనం పెట్టుకుని వేడెక్కాక కాస్త నూనె వేసుకుని ఈ ప్యాన్ కేక్ వేసుకోవాలి.
చుట్టూ నూనె పోసుకుంటు కాల్చుకోవాలి .
ముదురు గోధుమ రంగులోకి మారాక బయటకు తీయాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే ప్యాన్ కేక్ రెడీ. చివర్లో కొత్తిమీరతో గార్నీషింగ్ చేసుకోండి.
Related Web Stories
ఈ ఆహార పదార్థాలను రెండోసారి వేడి చేస్తే డేంజర్..
ఈ పండ్ల తొక్కలతో ఎన్నో రోగాలకు చెక్ పెటొచ్చు..!
ప్రపంచ నలుమూలల నుంచి కుంభమేళాకు పర్యాటకులు
కాళ్ల మడమలు పగులుతున్నాయా.. ఇలా చేస్తే మృదువుగా మారతాయి