కాళ్ల మడమలు పగులుతున్నాయా..  ఇలా చేస్తే మృదువుగా మారతాయి..

 చలికాలం రాగానే శరీరంలో, చర్మంలో అనేక మార్పులు సంభవిస్తాయి. 

చాలా మంది చర్మం పగుళ్లు, మడమల సమస్యతో బాధపడుతుంటారు.

 అయితే, ఈ అద్భుతమైన హోం రెమెడీ ఒక వారంలో పగిలిన మడమలను సరిచేస్తుంది.

రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో మీ మడమలను మసాజ్ చేయాలి.

ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా పగిలిన మడమలను నయం చేస్తుంది.

పగిలిన మడమలను నయం చేయడానికి, గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలపి మీ పాదాలను నానబెట్టలి.

ఇది చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటు మడమల పగుళ్లకు ఉపశమనాన్ని అందిస్తుంది.

చర్మం, మడమల పగుళ్లను నివారించడానికి విటమిన్లు ఎ, సి, ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.