ఈ జీవులు వందల ఏళ్లు బతికేస్తాయి..

గ్రీన్‌లాండ్ షార్క్ ఆర్కిటిక్ నీళ్లలో నివసించే ఈ షార్క్‌లు దాదాపు 400 ఏళ్లు బతుకుతాయి. 

ఓసియన్ క్వాహాగ్ ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో కనిపించే ఈ నత్త గుల్లలు 250 సంవత్సరాలకు పైనే బతుకుతాయి. 

అల్డాబ్రా భారీ తాబేలు అల్డాబ్రా అటోల్ ప్రాంతంలో నివసించే ఈ రకం తాబేళ్లు 200 సంవత్సరాలు మనుగడ సాగిస్తాయి. 

రఫై రాక్‌ఫిష్ పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో జీవించే ఈ రాక్‌ఫిష్‌లు 200 సంవత్సరాలు జీవిస్తాయి. 

టౌటారస్ న్యూజిలాండ్ అడవుల్లో కనిపించే ఈ బల్లులు 100 నుంచి 150 ఏళ్లు బతుకుతాయి. 

బౌహెడ్ వేల్ ఆర్కిటిక్‌కు చెందిన ఈ వేల్స్ దాదాపు 200 సంవత్సరాలు జీవిస్తాయి. 

ఆసియా ఏనుగు ఆసియా ప్రాంతానికి చెందిన ఏనుగులు వందేళ్లకు పైనే మనుగడ సాగిస్తాయి. 

కొకాటో ఆస్ట్రేలియా, న్యూగినియా ప్రాంతాల్లో కనిపించే ఈ పక్షులు కూడా వందేళ్లకు పైనే జీవిస్తాయి.