దోస అంటుకోకుండా రావాలంటే  ఇలా చేయండి..

ముందుగా పెనాన్ని జిడ్డు లేకుండా నున్నగా శుభ్రం చేసుకోవాలి. 

తరవాత స్టవ్‌ మీద పెట్టి చిన్న మంట మీద వేడి చేయాలి. 

పెనం మీద నీళ్లు చల్లితే చిటపటమంటూ వెంటనే ఆవిరైపోవాలి. అప్పుడే దోశ వేయడానికి పెనం అనుకూలంగా ఉంటుంది. 

ఒక పెద్ద ఉల్లిపాయను మధ్యకు కోసి దానితో పెనమంతా రుద్దాలి. 

తరవాత ఒక గంటెతో దోశ పిండిని పెనం మధ్యలో వేసి గుండ్రంగా వేగంగా రుద్దుతూ పెనమంతా పరచాలి.

 ఈ దోశ మీద కొన్ని  నూనె చుక్కలు వేయాలి.

మంట మధ్య స్థాయిలో ఉండేలా చూసుకుంటే ఒక నిమిషంలో చుట్టూ ఎర్రగా కాలి. దోశ చక్కగా వేగి పెనం నుంచి సులువుగా వచ్చేస్తుంది.