కనుబొమ్మలు ఒత్తుగా,  అందంగా ఉండాలంటే..!

ఒక గిన్నెలో రెండు చెంచాల ఆముదం వేసి వేడిచేయాలి. 

దీనిని చూపుడు వేలితో కొద్దిగా తీసుకుని కనుబొమ్మల మీద రాసి ఒకే దిశలో అయిదు నిమిషాలపాటు మర్దన చేయాలి.

ఇలా రోజుకు రెండుసార్లు చేస్తూ ఉంటే కనుబొమ్మలు రాలడం తగ్గుతుంది.

రాత్రిపూట రెండు చెంచాల మెంతులను మంచినీటిలో నానబెట్టాలి.

ఉదయాన్నే వీటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని కనుబొమ్మలకు పట్టించాలి. 

పావుగంట తరవాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే కనుబొమ్మలు బాగా పెరుగుతాయి.

కలబంద ఆకు లోపలి గుజ్జును తీసుకుని కనుబొమ్మలపై మెల్లగా రుద్దాలి.

పది నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

ఇలా రోజూ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.