పిల్లలు మొబైల్స్ చూస్తూ కోర్చోవడం ఎంతో అనర్థదాయకం. శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలను మొబైల్ నుంచి దూరం చేసేందుకు కొన్ని టిప్స్ పాటించండి.
ముందుగా మీరు పిల్లల ముందు మొబైల్ చూడడం మానేయండి. వారికి తగినంత సమయం కేటాయించండి. వారితో కలిసి ఆడుకోండి.
పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు వారికి ఆర్ట్స్‌ను పరిచయం చేయండి. వారితో బొమ్మలు వేయించండి. కొత్త విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించండి.
పిల్లలతో కలిసి వంట చేయండి. వారికి కుకింగ్ టిప్స్ నేర్పండి. మీ మధ్య బందాన్ని పటిష్టం చేసుకోండి.
రాత్రి వేళల్లో పిల్లలతో కలిసి చెస్, ఇతర బోర్డ్ గేమ్స్ ఆడండి. పజిల్స్ సాల్వ్ చేయించండి. వారిలో ఆలోచనా శక్తిని పెంపొందించండి.
పిల్లలతో తోట పని చేయించండి. మొక్కలను నాటించండి. ప్రకృతిలో వారు తగినంత సమయం గడిపేలా జాగ్రత్తలు తీసుకోండి.
పిల్లలకు కథలు చెప్పడం ద్వారా వారిలో ఊహా శక్తిని పెంచవచ్చు. ఎదుటి వారు చెప్పేదాన్ని అర్థం చేసుకోవడం నేర్పండి.
పిల్లలు సైన్స్ ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించండి. అవి వారిలో ఉత్సాహం, కుతూహలం, ధైర్యం పెంచుతాయి.
మొబైల్స్ కంటే ఎక్కువ ఆసక్తి కలిగించే ఆటలు, విషయాలు బయట చాలా ఉన్నాయని వారికి తెలిసేలా చేయండి.