పనస తొనలతో హల్వా..  సమ్మర్‌లో చాలా మంచిది..

ముందుగా గింజలు తీసేసిన పనస తొనలను మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేయాలి.

 స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో అర కప్పు నీళ్లు పోసి బెల్లం వేసి కరిగించాలి. తరువాత బెల్లం నీళ్లను ఒక గిన్నెలోకి వడబోయాలి.

స్టవ్‌ మీద పాన్‌ పెట్టి  నెయ్యి వేసి వేడిచేయాలి. 

ఇందులో బాదం, జీడిపప్పు, పిస్తా వేసి దోరగా వేపి ఒక పళ్లెంలోకి తీసుకోవాలి.

తరువాత పాన్‌లో పనస తొనల పేస్టు వేసి బాగా కలపాలి.

పచ్చివాసన పోయేవరకూ వేగనివ్వాలి. తరువాత బెల్లం నీళ్లు పోసి కలుపుతూ ఉండాలి.

ఈ మిశ్రమం పాన్‌ నుంచి విడిపోతున్నప్పుడు పచ్చికోవా, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

రెండు నిమిషాల తరవాత వేయించిన బాదం, జీడిపప్పు, పిస్తా వేసి కలిపి స్టవ్ నుంచి కిందకి దించేయాలి.