ఆహారాలు లేకుండా పాములు  ఎన్ని రోజులు జీవిస్తాయో తెలుసా?

 పాములు ఈ భూమిపై కనిపించే అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి.

భూమిపై కనిపించే అన్ని పాములు మాంసాహారులు. వాటి ఆహారంలో వివిధ రకాల జీవులు , జంతువులు ఉంటాయి. అవి కప్పలు, ఎలుకలు, బల్లులు, పక్షులు , చిన్న క్షీరదాలను తింటాయి. చాలా పాములు ఇతర పాములను కూడా తింటాయి.

 కొన్ని పాములు అయితే ఏకంగా పెద్ద పెద్ద జంతువులను సైతం చంపుకొని తినే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

పాములు తినకుండా లేదా త్రాగకుండా ఎన్ని రోజులు జీవించగలవో తెలుసా. నిజం తెలిస్తే ఈ విషయంలో మనిషి కంటే పాములే చాలా గ్రేట్ అంటారు.

పాము తినకుండా లేదా త్రాగకుండా ఎన్ని రోజులు జీవించగలదు? ఇది వాటి జాతి, పరిమాణం , పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

చాలా పాములు 10 నుండి 12 రోజులు జీవించగలవు, కొన్ని పాములు రెండు సంవత్సరాల వరకు ఏమీ తినకుండా లేదా త్రాగకుండా జీవించగలవు.

  మరికొన్ని పాములు మాత్రం 20 నుంచి 22 రోజులు ఆహారం లేకుండా జీవించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట.

 ఇక చలి ప్రాంతాల్లో జీవించే పాములయితే చలికాలం మొత్తం నిద్రలోకి వెళ్లి ఆహారం తీసుకోకుండా జీవిస్తాయట.