ప్రస్తుతానికి మీకు అదనపు పని చేసే సామర్థ్యం లేకపోతే షెడ్యూల్ చేయండి.రేపు లేదా మరో రోజు పని చేస్తాను అని చెప్పండి.
మీకు పని చేయడం ఇష్టం లేకపోతే.. ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్న దానిపై ఆసక్తి ఉన్న వ్యక్తిని సిఫార్సు చేయండి.
మీకు అత్యవసరమైన పని ఉంటే, నేను దానిని చేయలేను ఎందుకంటే.. ముఖ్యమైన పని ఉంది అని చెప్పడం ఉత్తమం.
పని అభ్యర్థనను తిరస్కరించే బదులు, సాధ్యమైనంత వరకు పనిని పూర్తి చేస్తాను అని చెప్పవచ్చు.
మీరు అల్రెడి పనిలో ఉంటే.. అదనపు పని ఇచ్చినప్పుడు..ఇచ్చిన పనిపై శ్రద్ధ పెట్టలేను.. దాని వల్ల వర్క్‌లో సమస్యలు తలెత్తుతాయని వివరించండి.
ఒక పని మీ నైపుణ్యానికి వెలుపల ఉండవచ్చు లేదా దాన్ని పూర్తి చేయడానికి మీకు వనరులు లేకపోవచ్చు. అలాంటి సందర్భంలో దీన్ని చేయడానికి నాకు తగినంత వనరులు లేవు అని చెప్పండి.
మీ దగ్గర ఉన్న పని కొద్దిసేపటిలో పూర్తి అవుతుంటే.. కాసేపు తరువాత ఇచ్చిన పని చేస్తాను అని చెప్పండి.
మీరు ఎల్లప్పుడూ అదనపు పనిని తిరస్కరించాల్సిన అవసరం లేదు. మీ ప్రస్తుత షెడ్యూల్లో పనిని అమర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు మరింత ప్రేరణ పొందారని భావిస్తే, ఒకటి లేదా రెండు రోజులు ఓవర్ టైం పని చేయండి.