పాలకూర పెరుగుపచ్చడి  ఇలా చేస్తే టేస్ట్‌ అదుర్స్‌...

 కావలసిన పదార్థాలు: ఉడికించిన పాలకూర - రెండు కప్పులు, పెరుగు - కప్పు, పసుపు - అర స్పూను,

పచ్చి మిర్చి - ఒకటి, పచ్చి కొబ్బరి - రెండు స్పూన్లు, జీలకర్ర - అర స్పూను, కరివేపాకు రెబ్బలు - నాలుగు,

నెయ్యి - స్పూను, పోపుగింజలు - స్పూను, కొత్తిమీర - రెండు స్పూన్లు, నీళ్లు, ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం: పచ్చికొబ్బరి, మిర్చి, జీలకర్రతో పాటు పాలకూరను మిక్సీలో వేసి స్మూతీలా చేసుకోవాలి. 

 ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో పెరుగు లేదా మజ్జిగ, ఉప్పు వేసి బాగా కలిపి పోపు పెడితే సరి.

 పైన కొత్తిమీర తరుగు చల్లడం మరచిపోకూడదు.